వాట్సాప్.. ప్రస్తుతం భారతదేశంలోనే (M.L.A – telangana )కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ యాప్ అని చెప్పొచ్చు. వ్యక్తిగత చాటింగ్, గ్రూప్ సంభాషణలు, ఫోటోలు, లొకేషన్, డాక్యుమెంట్ షేరింగ్ వరకు అన్నింటినీ సులభతరం చేసింది. అయితే ఈ సౌలభ్యం కొన్నిసార్లు చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – 2000 (IT Act) ద్వారా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో కంటెంట్ షేరింగ్‌కి స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. ఈ చట్టం ప్రకారం వాట్సాప్ “ప్రైవేట్ చాట్ యాప్” అయినా కూడా అపరాధక కంటెంట్ పంపితే లేదా రెచ్చగొట్టే మెసేజ్ షేర్ చేస్తే దానిపై చర్య తీసుకోవచ్చని స్పష్టం చేస్తుంది. ఇతర దేశాల్లో లాగే, భారత్‌లో కూడా వాట్సాప్ మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ ఉన్నప్పటికీ.. పోలీసులు లేదా సైబర్ క్రైమ్ యూనిట్‌కి ఫిర్యాదు వచ్చినపుడు దర్యాప్తు చేపట్టవచ్చు అని వెల్లడిస్తున్నారు.